జగ్గంపేటలో విద్యుత్ ఉద్యోగులు తమ డిమాండ్ల సాధన కోసం మంగళవారం ధర్నా నిర్వహించారు. 1999-2004 మధ్య నియమితులైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, ఔట్ సోర్సింగ్ సిబ్బంది సేవలను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే, బకాయిపడిన కరువు భత్యం వెంటనే విడుదల చేయాలని, పనికి అనుగుణంగా అదనపు పోస్టులను మంజూరు చేయాలని కోరారు.