ఆసుపత్రికి ఎవరూ రావద్దు... ముద్రగడ తనయుడి విజ్ఞప్తి

2403చూసినవారు
ఆసుపత్రికి ఎవరూ రావద్దు... ముద్రగడ తనయుడి విజ్ఞప్తి
కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభ రెడ్డి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయనను పరామర్శించడానికి నాయకులు, అభిమానులు ఎవరూ రావద్దని ఆయన తనయుడు వీర రాఘవరావు విజ్ఞప్తి చేశారు. పరామర్శల వల్ల ఆసుపత్రి సిబ్బందికి, వైద్యులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కాబట్టి ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్