
జగ్గంపేట: విద్యుత్‌ను పొదుపుగా వినియోగించుకోవాలి
జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం సందర్భంగా, ప్రిన్సిపల్ డా. దేవరపల్లి చెన్నారావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ మాధురి, భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి పౌరుడు విద్యుత్‌ను పొదుపుగా వాడాలని సూచించారు.








































