
విద్యార్థులకు మహిళా చట్టాలపై అవగాహన
గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ నందు సోమవారం విద్యార్థులకు మహిళా చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సీఐ వైఆర్ కే శ్రీనివాస్, గండేపల్లి ఎస్ఐ ఎస్. శివ నాగబాబు పాల్గొని, సైబర్ నేరాలు, ఈవ్ టిజింగ్ లను ఎలా అరికట్టాలో, అత్యవసర పరిస్థితుల్లో శక్తి యాప్ ఎలా ఉపయోగపడుతుందో విద్యార్థులకు వివరించారు.






































