
గోకవరంలో జాతీయ పత్రికా దినోత్సవం
గోకవరంలో ఆదివారం రాత్రి బీజేపీ నాయకులు, విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో వ్యయ ప్రయాసలతో విలేకరి వృత్తిని కొనసాగిస్తున్నారని, విలేకరులకు ఏ సమస్య వచ్చినా ఆర్థికంగా ఆదుకుంటానని కంబాల శ్రీనివాసరావు తెలిపారు. అనంతరం విలేకరులకు స్వీట్స్ పంపిణీ చేశారు.





































