
పిఠాపురానికి పవన్ కళ్యాణ్ శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలి: ఎంపీ
పిఠాపురం నియోజకవర్గ ప్రజలు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను శాశ్వత ఎమ్మెల్యేగా ఉండాలని కోరుకుంటున్నారని ఎంపీ ఉదయ శ్రీనివాస్ శుక్రవారం పిఠాపురంలో కార్యకర్తల సమావేశంలో తెలిపారు. గొల్లప్రోలు, కొత్తపల్లి, పిఠాపురం మండలాలకు సంబంధించిన గ్రామ కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక నాయకుల నుంచి సమస్యలు, జనసేన పార్టీ పరిస్థితులపై ఆయన ఆరా తీశారు.








































