కాజులూరు మండలం దుగ్గుదుర్రులో ఆదివారం చల్ల బజ్జీలు తిన్న దాదాపు 40 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. వీరిని దుగ్గుదూరు పీహెచ్‌సీలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల ప్రకారం, వీరికి ఎలాంటి ప్రమాదం లేదని, మరికొందరు ప్రైవేట్ ఆస్పత్రుల్లో కూడా చేరారని తెలిపారు. ఆరోగ్యశాఖ సిబ్బంది గ్రామంలో పర్యటించి, బజ్జీలు తిన్న ఇతర వ్యక్తులను గుర్తించి
పరీక్షలు నిర్వహిస్తున్నారు.