కాకినాడ శివారు నూకాలమ్మ మాన్యం వద్ద రోడ్డు పక్కన కాలువలో పడి సుమారు 55 ఏళ్ల వయస్సు గల గుర్తుతెలియని వ్యక్తి సోమవారం మృతిచెందాడు. స్థానిక వీఆర్వో ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలిసిన వారు 9440796541 నెంబర్ కు సమాచారం అందించాలని కాకినాడ టూటౌన్ సీఐ అప్పలనాయుడు తెలిపారు.