కాకినాడ, మే 31: కాకినాడ ద్వారకానగర్ కు చెందిన 19 ఏళ్ల బీటెక్ విద్యార్థిని మే 28న ఇంట్లో నుంచి వెళ్లిపోయిన ఘటనపై శుక్రవారం కాకినాడ రెండో పట్టణ పోలీసులు కేసు నమోదు చేశారు. తల్లిదండ్రులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.