బంగాళాఖాతంలో దూసుకు వస్తున్న మంతా తుఫాన్, ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉంది. ఈ నెల 26, 27, 28, 29 తేదీలు అత్యంత కీలకం కానున్నాయి. గంటకు 70-100 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉన్నందున, ప్రజలు ఈ తేదీల్లో ప్రయాణాలు పెట్టుకోకుండా, అవసరమైన వస్తువులను సిద్ధం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. సముద్ర తీర ప్రాంతాలకు, బీచ్‌లకు ఎవరూ వెళ్లరాదని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని ఉన్నతాధికారులు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో ఏదైనా ప్రమాదం జరిగితే స్థానిక రెవెన్యూ లేదా పోలీసు అధికారులను సంప్రదించాలని తెలిపారు.