ఉరేసుకుని బాలిక ఆత్మహత్యాయత్నం

278చూసినవారు
ఉరేసుకుని బాలిక ఆత్మహత్యాయత్నం
కాకినాడ గ్రామీణంలో మంగళవారం వ్యక్తిగత కారణాలతో ఓ బాలిక (17) ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. డిగ్రీ మొదటి ఏడాది చదువుతున్న ఆమె, ఇటీవల ఇంట్లో చెప్పకుండా ప్రేమించిన అబ్బాయితో వెళ్లిపోయింది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెను గుర్తించి అప్పగించారు. ఈ నేపథ్యంలో బాలిక ఇంట్లో చీరతో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఆమె కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతోంది.

సంబంధిత పోస్ట్