కాకినాడ జిల్లాలో రైతులకు అవసరమైన యూరియా అందుబాటులో ఉందని జిల్లా వ్యవసాయ అధికారి విజయకుమార్ మంగళవారం తెలిపారు. ఇప్పటికే 500 టన్నుల యూరియా సిద్ధంగా ఉందని, మరో రెండు మూడు రోజుల్లో 400 టన్నులు రానుందని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4 వేల టన్నులకు పైగా నిల్వలు ఉన్నాయని, రైతులకు పూర్తిస్థాయిలో అందిస్తామని స్పష్టం చేశారు. ఎరువుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.