వికాస కార్యాలయంలో 12న ఉద్యోగ మేళా

263చూసినవారు
వికాస కార్యాలయంలో 12న ఉద్యోగ మేళా
కాకినాడ కలెక్టరేట్‌లోని వికాస కార్యాలయం వద్ద జనవరి 12న ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు వికాస పీడీ కె. లచ్చారావు తెలిపారు. డెక్కన్ కెమికల్స్, ఇసుజు మోటార్స్, హోండాయ్ మోబీస్, టాటా ఎలక్ట్రానిక్స్, ఫాక్స్‌కాన్, ప్రీమియం ఎనర్జీస్, అపోలో టైర్స్ వంటి కంపెనీల్లో వివిధ ఉద్యోగాలకు ముఖాముఖి ఎంపికలు జరుగుతాయి. అర్హతలు, వయసు వివరాల కోసం www.vikasajobs.com వెబ్‌సైట్‌ను సందర్శించాలని, ఆసక్తిగలవారు సోమవారం ఉదయం 9 గంటలకు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలని సూచించారు.

సంబంధిత పోస్ట్