ఉరి వేసుకుని ఓ వ్యక్తి మృతిచెందిన ఘటనపై కాకినాడ రెండో పట్టణ పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. కాకి నాడ మెహన్ నగర్ కు చెందిన పి. వెంకటరమణ (43) వ్యక్తిగత కారణాలతో మనస్తాపం చెంది ఇంటివద్ద వంటగది తలుపు గ్రిల్ కు చీరతో ఉరేసుకున్నాడు. అవివాహితుడైన అతను మద్యానికి బానిసయ్యాడు. కొంతకాలంగా అనారోగ్యం, తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని బంధువులు పేర్కొన్నారు. మృతుడి బంధువు ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు మీడియాకు తెలిపారు.