కాకినాడ: వయసును గెలిచి.. పతకాలు సాధించి!

532చూసినవారు
ప్రతిభకు వయసు అడ్డుకాదని కాకినాడ మహిళలు నిరూపించారు. థాయిలాండ్‌లో జరిగిన వరల్డ్ మాస్టర్స్ స్పోర్ట్స్ పోటీల్లో 45+, 55+ విభాగాల్లో పాల్గొని వీరు పతకాలు సాధించారు. బుధవారం కలెక్టరేట్‌లో అధికారులను కలిసి తమ పతకాలను ప్రదర్శించగా, వారు ఘనంగా అభినందించారు. 40 దాటితే విశ్రాంతి అనుకునే వారికి ఆదర్శంగా నిలుస్తూ, అంతర్జాతీయ స్థాయిలో జిల్లా ఖ్యాతిని వీరు ఇనుమడింపజేశారు.