కాకినాడ: 'న్యూ ఇయర్ ఫుడ్'.. కల్తీ చేస్తే.. కటకటాలే!

345చూసినవారు
కాకినాడ: 'న్యూ ఇయర్ ఫుడ్'.. కల్తీ చేస్తే.. కటకటాలే!
కొత్త సంవత్సర వేడుకల వేళ ఆహార పదార్థాల తయారీలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని కాకినాడ ఆహార నియంత్రణ అధికారి నందాజీ స్పష్టం చేశారు. అనుమతి లేని రంగులు, నిల్వ ఉంచిన పదార్థాలు వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కలుషిత ఆహారం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. స్వీట్లు, ఫాస్ట్ ఫుడ్ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని వెల్లడించారు.

సంబంధిత పోస్ట్