కాకినాడ: సంక్రాంతి వేళ.. సొంతూళ్లకు పయనం (

496చూసినవారు
కాకినాడ: సంక్రాంతి వేళ.. సొంతూళ్లకు పయనం (
సంక్రాంతి సంబరాల కోసం పక్క రాష్ట్రాలు, విదేశాల్లో ఉంటున్న వారంతా సొంతూళ్లకు తరలివస్తున్నారు. దీంతో శనివారం కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారి వాహనాలతో కిక్కిరిసిపోయింది. వాహనాల రద్దీ ఒక్కసారిగా పెరగడంతో టోల్‌గేట్ దాటడానికి ప్రయాణికులు గంటల తరబడి వేచి చూస్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉభయ గోదావరి జిల్లాల్లో పండుగ సందడి మొదలవడంతో రహదారులన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి.

సంబంధిత పోస్ట్