కాకినాడ ఫిషింగ్ హార్బర్ కు చెందిన బొమ్మిడి మంగ (45) కాకినాడ జీజీహెచ్ లో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. నవంబర్ 3న రాత్రి 8 గంటల సమయంలో పురుగు కాలి పాదంపై వెళ్లినా ఆమె పట్టించుకోలేదు. గురువారం తెల్లవారుజామున పాదంపై వాపు, నీరు కారడంతో కాకినాడ జీజీహెచ్ లో చేర్చారు. చికిత్స పొందుతూ మృతి చెందడంతో కాకినాడ పోర్టు పోలీసులు కేసు నమోదు చేశారు.