ఏప్రిల్ 1న కొత్త కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

1431చూసినవారు
ఏప్రిల్ 1న కొత్త కలెక్టర్ బాధ్యతల స్వీకరణ
కాకినాడ జిల్లాకు నూతన కలెక్టర్‌గా హరేందిర ప్రసాద్ బుధవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు విశాఖపట్నం కలెక్టరేట్ నుంచి కాకినాడ కలెక్టరేట్‌కు సమాచారం అందింది. ఇప్పటివరకు కలెక్టర్‌గా పనిచేసిన షణ్మోహన్‌కు మంగళవారం జిల్లా అధికారులు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కాకినాడ జిల్లా అభివృద్ధికి కలెక్టర్ షణ్మోహన్ ఎంతో కృషి చేశారు.