అక్రమ స్కూల్ ఆటోలపై పోలీసుల కొరడా: 130 సీజ్

350చూసినవారు
అక్రమ స్కూల్ ఆటోలపై పోలీసుల కొరడా: 130 సీజ్
కాకినాడ జిల్లా పోలీసులు శనివారం స్కూల్ పిల్లలను తరలించే ఆటోలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఎస్పీ జి.బిందుమాధవ్ ఆదేశాల మేరకు, ఎస్డీపీవో దేవరాజ్ మనీష్‌పాటిల్ పర్యవేక్షణలో జరిగిన ఈ డ్రైవ్‌లో, ప్రభుత్వ అనుమతులు లేకుండా నడుస్తున్న సుమారు 130 ఆటోలను సీజ్ చేశారు. రికార్డులు లేని కొన్ని ఆటోలను రవాణా శాఖ అధికారులకు అప్పగించగా, మిగిలిన వాటిపై పోలీసులు చలాన్లు విధించారు. పరిమితికి మించి పిల్లలను తీసుకెళ్లరాదని, డ్రైవర్లకు పలు విషయాలపై అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్