భానుగుడి నుంచి ఎస్పీ కార్యాలయం వరకు వాహనాల క్యూలు

228చూసినవారు
కాకినాడలో ఆదివారం ఉదయం పెట్రోలు, డీజిల్ కోసం వాహనదారులు భారీగా క్యూ కట్టారు. భానుగుడి సెంటర్ నుంచి ఎస్పీ కార్యాలయం వరకు వాహనాల వరుస కనిపించింది. ఉదయం 7 గంటల నుంచే పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరిగి, వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సరఫరా లోపం కారణంగా ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్