
ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరి: సీఐ రమేశ్
కాకినాడ ట్రాఫిక్ వన్ సీఐ నూని రమేశ్ వాహన చోదకులు, డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. మంగళవారం టౌన్ హాల్ సెంటర్లో నిర్వహించిన అవగాహన తరగతిలో సైబర్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్ గురించి వివరించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనాలతో రోడ్డుపైకి వచ్చేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ చట్టాలను పాటించాలని ఆయన నొక్కి చెప్పారు.







































