
మోటార్ వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు అరెస్టు
కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం, పిఠాపురం పోలీసులు 40 దొంగిలించిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో 18 ఆటోలు, 22 మోటార్ సైకిళ్లు ఉన్నాయి. స్వాధీనం చేసుకున్న వాహనాల విలువ సుమారు రూ. 60 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.






































