
కాకినాడలో రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం: కలెక్టర్ షన్మోహన్
కాకినాడ జిల్లాలో నవంబర్ 10న సోమవారం ఉదయం పీజీఆర్ఎస్ కార్యక్రమం యథావిధిగా నిర్వహిస్తామని కలెక్టర్ షాన్ మోహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార నిమిత్తం ప్రతి సోమవారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు కాకినాడ కలెక్టరేట్లో జరిగే ఈ కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరవ్వాలని, అర్జీదారులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు.





































