మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్య

277చూసినవారు
మనస్తాపానికి గురైన వివాహిత ఆత్మహత్య
కాకినాడ రామారావుపేటలో జి. వెంకటసూర్యదీప్తి (36) అనే వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. భర్త జగదీష్‌కుమార్ అప్పుల బాధలు, ఉద్యోగం లేకపోవడంతో కుటుంబ కలహాలు తలెత్తాయని, దీంతో మనస్తాపానికి గురైన సూర్యదీప్తి సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్