కాకినాడకు చెందిన 14 ఏళ్ల చీకట్ల ధనుష్, తాళ్లరేవు మండలం బొడ్డువానిలంకలోని మేనమామ ఇంటికి వచ్చినప్పుడు ఏప్రిల్ 27న ఆడుకుంటూ బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు, బంధువులు ఎంత వెతికినా ఆచూకీ లభించకపోవడంతో, మంగళవారం కోరంగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సత్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాలుడి గురించి సమాచారం తెలిసినవారు సమీప పోలీసులకు తెలియజేయాలని కోరారు.