తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని అచ్చంపేట కూడలిలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కాకినాడ కోర్టు డ్రైవర్ రావులపూడి వీరబాబు (43) మృతి చెందారు. పిఠాపురం నుంచి కాకినాడకు ద్విచక్రవాహనంపై వస్తుండగా, లైట్ హౌస్–సామర్లకోట మార్గంలో వెళ్తున్న లారీ ఢీకొట్టడంతో వీరబాబు తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుడి తండ్రి పైడిరాజు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.