బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తీరం దాటినప్పటికీ, బుధవారం ఉదయం కాకినాడ సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. కాకినాడ నుంచి ఉప్పాడ వరకు బీచ్ రోడ్డులో సముద్ర కెరటాలు ఎగిసిపడుతూ, రోడ్డును తీవ్రంగా ధ్వంసం చేశాయి. సముద్ర కెరటాల ఉధృతి అధికంగా ఉండటంతో ఈ మార్గంలో ప్రయాణించవద్దని పోలీసులు సూచించారు. సముద్ర కెరటాల హోరు స్థానిక ప్రజలకు భయం కలిగిస్తోంది.