రాయవరం మండలం వెదురుపాకలో జరిగిన పోలేరమ్మ జాతరలో ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ మంగళవారం సందడి చేశారు. తన స్వగ్రామానికి వచ్చిన ఆయనను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. గరగ నృత్య కళాకారుల డప్పు వాయిద్యాలకు అనుగుణంగా దేవిశ్రీ ప్రసాద్ వేసిన స్టెప్పులు అక్కడి స్థానికులను ఎంతగానో ఉత్సాహపరిచాయి. ఆయన జాతరలో సాధారణ వ్యక్తిలా అందరితో కలిసిపోయి అందరినీ అలరించారు.