కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ స్లాబ్ రేట్లు తగ్గించిన నేపథ్యంలో, నిత్యవసర వస్తువుల ధరలను కూడా తగ్గించి, అదే రేట్లకు విక్రయించాలని కరప ఎంపీడీవో శ్రీనివాసరావు కిరాణా వ్యాపారులను ఆదేశించారు. శనివారం కరపలోని షాపులను తనిఖీ చేసిన ఆయన, తగ్గిన ధరల ప్రకారం విక్రయించకుంటే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీల్లో కార్యదర్శి యూ. నిర్మలాదేవి తదితరులు పాల్గొన్నారు.