కాకినాడలోని ఒక లాడ్జిలో దొంగనోట్ల చలామణి, నగదు బదిలీ జరుగుతుందన్న సమాచారం మేరకు త్రీటౌన్ పోలీసులు బుధవారం రాత్రి ఆకస్మిక దాడి చేశారు. ఈ ఘటనలో అనుమానాస్పదంగా ఉన్న తాడేపల్లిగూడెం, రాజమండ్రికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వారి వద్ద నుండి కేంద్ర ప్రభుత్వ, డిజిటల్ మీడియా స్టిక్కర్లు ఉన్న రెండు కార్లు, డబ్బు లెక్కించే యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, అయితే ఇంకా కేసు నమోదు కాలేదని CI తెలిపారు.