కువైట్‌లో యుద్ధ భయం.. మాధవపట్నం వాసి ఆవేదన

847చూసినవారు
ఇరాన్ యుద్ధ ప్రభావంతో కువైట్‌లో ప్రజలు భయం గుప్పెట్లో బతుకుతున్నారని సామర్లకోట మండలం మాధవపట్నానికి చెందిన పడాల రమేశ్ తెలిపారు. అక్కడ తాజా పరిస్థితులపై ఆయన ఒక వీడియో విడుదల చేశారు. కొన్ని చోట్ల బాంబులు పడినప్పటికీ, ప్రస్తుతానికి ప్రాణనష్టం లేదని పేర్కొన్నారు. అయితే బాంబుల భారీ శబ్దాలతో అక్కడి వారు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నారని వివరించారు.