కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్తున్న కారు వేములవాడ సమీపంలో రాగానే దాన్ని కింద గడ్డి చిక్కుకుంది. కొత్తూరు వచ్చేసరికి కారు కింద మంటలు రావడంతో బైకర్ గమనించి వారికీ చెప్పాడు. అప్పటికే బ్రేకులు ఫెయిల్ కావడంతో హ్యాండ్ బ్రేక్ వేసి దూకి ప్రాణాలతో బయటపడ్డారు. కారు పూర్తిగా కాలి బూడిదైంది.