దుగ్గుదుర్రులో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత

984చూసినవారు
దుగ్గుదుర్రులో ఫుడ్ పాయిజన్.. 50 మందికి అస్వస్థత
కాజులూరు మండలం, దుగ్గుదుర్రులో చల్ల బజ్జీలు తిన్న దాదాపు 50 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితుల్లో పలువురు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. నరసింహ నాయక్ స్పందించి, అదనపు వైద్య బృందాలను నియమించి, బాధితులకు అవసరమైన వైద్యం, మందులు అందుబాటులో ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఘటనకు గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్