కాకినాడ జిల్లాలో స్క్రబ్ టైపస్ కేసులు పెరుగుదల

744చూసినవారు
కాకినాడ జిల్లాలో స్క్రబ్ టైపస్ కేసులు పెరుగుదల
కాకినాడ జిల్లాలో స్క్రబ్ టైపస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని డీఎంహెచ్వో వెల్లడించారు. గత ఏడాది కాలంలో జిల్లాలో మొత్తం 191 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అందులో గత నెలలోనే 43 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా సమీప ఆసుపత్రిని సంప్రదించాలని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్