జగ్గంపేట: హత్య చేసి.. పంటకాలువలో పడేసి..?

685చూసినవారు
జగ్గంపేట: హత్య చేసి.. పంటకాలువలో పడేసి..?
జగ్గంపేట మండలం రామవరంలో మాంసం వ్యాపారి రావుల సత్తిబాబు (43) పంట కాలువలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. బుధవారం ఆయన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కుటుంబ కలహాలు లేదా ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగి ఉండవచ్చని పెద్దాపురం DSP తిలక్ తెలిపారు. మృతుడి అన్నయ్య వీణబాబు ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు DSP వెల్లడించారు.