నవంబర్ 1వ తేదీ ఉదయం నుంచే జిల్లాలోని 2.72 లక్షల మంది సామాజిక భద్రత పింఛను లబ్ధిదారులకు రూ.118.01 కోట్ల పంపిణీని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ షాన్మోహన్ అధికారులను ఆదేశించారు. మొదటి రోజే వంద శాతం పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. క్షేత్ర స్థాయిలో పంపిణీని తనిఖీ చేయాలని కలెక్టరు తన ప్రకటనలో స్పష్టం చేశారు.