ఆదివారం సాయంత్రం చాపరాయి వాగులో గల్లంతైన కాకినాడ వాసులైన పసుపులేటి దుర్గాప్రసాద్ (సాఫ్ట్వేర్ ఉద్యోగి) మరియు ఓలేటి మణికంఠ (బ్యాంక్ ఉద్యోగి) మృతదేహాలు సోమవారం ఉదయం లభ్యమయ్యాయి. వీరు మరో నలుగురితో కలిసి చాపరాయి జలపాతానికి విహారయాత్రకు వచ్చారు. గల్లంతైన వారి కోసం పోలీసులు గాలింపులు చేపట్టారు.