జనసేన పార్టీలో క్రమశిక్షణ లోపించిందని, పార్టీ పరువు రోడ్డున పడుతుందని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజుల క్రితం పార్టీ నాయకులు కొందరు చైర్మన్ తుమ్మల బాబు, పౌర సరఫరాల ఛైర్మన్ తోట సుధీర్ కు వ్యతిరేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశాన్ని దుగ్గన బాణ్ణి ఏర్పాటు చేశారని ఆరోపణలు వచ్చాయి. దీనికి ప్రతిస్పందనగా సోమవారం బాడ్జీకి అనుకూలంగా వీర మహిళలు సమావేశం ఏర్పాటు చేయడంతో పార్టీలో మరో వివాదం మొదలైంది.