నారదుడు తనను విష్ణుమాయ ఏమీ చేయలేదని గర్వపడగా, విష్ణుమూర్తి ఆయన అహంకారాన్ని అణచాడు. లోకసంచారంలో నారదుడు సర్పపురంలోని సరస్సులో స్నానం చేసి యువతిగా మారి, పూర్వ స్మృతి కోల్పోయి నకుందుడిని వివాహం చేసుకుని 60 మంది కుమారులను పొందాడు. వారంతా ఓ యుద్ధంలో మరణించగా, విష్ణుమూర్తి సూచనతో అదే సరస్సులో స్నానమాచరించి, తన నారదరూపం పొందాడు. తన తప్పు తెలుసుకున్న నారదుడు అక్కడ భావనారాయణ స్వామిని ప్రతిష్ఠించాడు.