రూరల్ రమణయ్యపేటలో 2016లో ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు, పదేళ్లుగా తమ సమస్య పరిష్కారం కావడం లేదని ఆరోపించారు. బిల్డర్, సైట్ ఓనర్ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ తమను మోసం చేస్తున్నారని వారు వాపోయారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని, తమకు న్యాయం చేయాలని కోరుతూ సోమవారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. అధికారులు స్పందించి తమ ప్లాట్లు తమకు దక్కేలా చూడాలని యజమానులు విజ్ఞప్తి చేశారు.