కాకినాడ: లోకేశ్ పర్యటన.. అధికారుల, మీడియాకు పోలీసుల అడ్డగింత!

314చూసినవారు
కాకినాడ జేఎన్టీయూలో మంత్రి లోకేశ్ పర్యటన సందర్భంగా పోలీసుల తీరు వివాదాస్పదమైంది. పీజీ బాయ్స్ హాస్టల్ ప్రారంభోత్సవానికి వచ్చిన సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ రామచంద్రరావు బృందాన్ని పోలీసులు అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో అధికారులు వెనుదిరిగారు. మీడియా ప్రతినిధులను కూడా లోపలికి అనుమతించకపోవడంతో వారు బయటే వేచి ఉండాల్సి వచ్చింది. ఈ సంఘటనలో సమన్వయ లోపం స్పష్టంగా కనిపించింది.

సంబంధిత పోస్ట్