కాకినాడ రూరల్ శ్రీ పేటలోని శ్రీపీఠంలో మహాశక్తి యాగం నిర్వహిస్తున్నట్లు పరిపూర్ణానంద స్వామి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాగంలో భాగంగా 100 కోట్ల కుంకుమార్చన జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలు 22వ తేదీ నుండి 3వ తేదీ వరకు కొనసాగుతాయని, 29వ తేదీన విద్యార్థులతో కలిసి సామూహిక సరస్వతి పూజ నిర్వహిస్తామని పేర్కొన్నారు.