కాకినాడ రూరల్ లోని శ్రీ పీఠంలో మంగళవారం ఘనంగా జరిగిన మహాశక్తి యాగంలో శ్రీ పరిపూర్ణానంద స్వామి భక్తులకు బోధించారు. సకల సృష్టికి మూలకారణమైన తల్లిని స్మరించుకుంటూ, ఎన్ని కష్టాలు ఎదురైనా గొప్ప సంకల్పంతో ముందుకు సాగాలని, సంకల్పానికి మించిన బలం లేదని ఆయన అన్నారు. ప్రతిరోజూ అమ్మవారి ధ్యానంతో పూజలు చేయాలని సూచించారు. వివిధ ప్రాంతాల నుంచి మహిళలు కుంకుమార్చనలో పాల్గొన్నారు.