శాసన మండలిలో మంత్రి లోకేష్ ప్రకటన ప్రకారం, మున్సిపల్ అవుట్ సోర్సింగ్ కార్మికులకు తల్లికి వందనంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని సీఐటీయూ నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు డిమాండ్ చేశారు. కాకినాడ రూరల్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, జి. ఓ. నెం 26 పేజీ 4 లో పేరా జి లో పేర్కొన్న విధంగా, 10 నుంచి 12 వేల జీతం కలిగిన శానిటేషన్ వర్కర్స్ కు తల్లికి వందనం అమలు చేయవచ్చని తెలిపారు.