కరప: బ్యాంకును ముట్టడించి ఆందోళన

1907చూసినవారు
కూరాడలోని 83 డ్వాక్రా మహిళలకు చెందిన సుమారు రూ.80 లక్షలు స్టేట్ బ్యాంక్ కరస్పాండెంట్ కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విషయం రుజువైనప్పటికీ చర్యలు తీసుకోకపోవడంతో, బాధితులైన మహిళలు గురువారం బ్యాంకును ముట్టడించి ఆందోళనకు దిగారు. కరస్పాండెంట్పై, డీఆర్డీఏ అధికారులపై కేసులు నమోదు చేయాలని, తమ డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్