కరప నీలయ్యతోటలో జరిగిన చోరీ కేసును పోలీసులు 20 గంటల్లోనే ఛేదించారు. కాకినాడ SDPO మనీశ్ కుమార్ దేవర్ బుధవారం మీడియా సమావేశంలో నిందితుడి అరెస్ట్ వివరాలను అధికారికంగా వెల్లడించారు. నిందితుడి నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఆపరేషన్‌లో చాకచక్యంగా వ్యవహరించిన CI చైతన్య కృష్ణ, SI సునీత బృందాన్ని ఆయన అభినందించారు.