బుధవారం తెల్లవారుజామున కత్తిపూడి సినిమా హాల్ సెంటర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి విశాఖ వెళ్తున్న పార్శిల్ లారీ హైవే డివైడర్‌ను ఢీకొని బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్‌లకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని హైవే అంబులెన్స్‌లో తుని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంతో జాతీయ రహదారిపై కాసేపు రాకపోకలకు అంతరాయం కలిగింది.