అంతర్వేది బీచ్ లో గల్లంతైన మృతదేహం లభ్యం

1038చూసినవారు
సఖినేటిపల్లి మండలంలోని అంతర్వేది బీచ్ వద్ద సముద్రంలో దూసుకుపోయిన కారులో కాకినాడకు చెందిన నిమ్మకాయల శ్రీధర్ అనే యువకుడి మృతదేహం లభ్యమైంది. సఖినేటిపల్లి పోలీసులు గురువారం ఉదయం కారును బయటకు తీయగా, మృతదేహం కారులోనే చిక్కుకొని ఉంది. రాజోలు సీఐ నరేష్ కుమార్, సఖినేటిపల్లి ఎస్ఐ దుర్గ శ్రీనివాస్ ఈ ఘటనపై పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.