మొంధా తుపాను నేపథ్యంలో కాకినాడ జిల్లాలో చేపట్టిన ప్రజల రక్షణ, సహాయ, పునరావాస చర్యలపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శుక్రవారం అమరావతి నుంచి వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ షాన్మోహన్, అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. 21 మండలాల పరిధిలోని 68 గ్రామాలు, ఏడు పట్టణ స్థానిక సంస్థల్లో 434 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి, 97 చోట్ల 48,024 మందికి ఆవాసం కల్పించినట్లు కలెక్టర్ తెలిపారు.